బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా పెద్దబోయిన సునీత
25-04-2026 03:08 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా పెద్దబోయిన సునీత ఎన్నికయ్యారు. పెద్దబోయిన సునీత ఎన్నికపట్ల బిజెపి సీనియర్ నాయకులు కొల్లి సంజీవరెడ్డి, శాసనాల రామయ్య, రామచంద్రనాయక్, నాగరాజ్, శ్రీనివాస్ కుమార్, శివ కుమార్, వంశీ, రజత్ కోరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దబోయిన సునీత మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






