10 July, 2026 | 2:08 AM

రాజ్యసభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా రవిచంద్ర

10-07-2026 12:58 AM

నియమించిన పార్టీ అధినేత కేసీఆర్ 

మహబూబాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమితు లయ్యారు. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా వ్యవహరిస్తున్న రవిచంద్రను బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాజ్యసభలో బీఆర్‌ఎస్ పక్ష నేతగా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా నియమించారు. బీసీలతోపాటు బహుజనులు, పార్టీకి  రవి చంద్ర అందిస్తున్న సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయన్ను రెండోసారి రాజ్యసభకు పంపించారు.

రవిచంద్ర పదవీ కా లం 2030 ఏప్రిల్ వరకు ఉంది. గురువారం కేసీఆర్‌ను వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖను కేసీఆర్ వద్దిరాజుకు అందజేశారు. ఈ సం దర్భంగా కేసీఆర్ ఎంపీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.