8 July, 2026 | 2:09 PM

టెస్కాబ్ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు

11-06-2024 12:52 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) అధ్యక్షుడి గా వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్ డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య నియామకం అయ్యారు. టెస్కాబ్ చైర్మన్‌గా ఉన్న కొండూరు రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ మధ్యంతరంగా సోమవారం టెస్కాబ్ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు మార్నేని రవీందర్‌రావు, కొత్తకుర్మ సత్తయ్యను నియామకం చేశారు.