విదేశాల్లో ఉన్నవారికీ రుణాలు
04-06-2024 12:05 AM
ముంబై, జూన్ 3: విదేశాల్లో ఉండే భారతీయులకు శుభవార్త. ఇకపై అక్కడ నివసించే వారు కూడా భారతీయ బ్యాంకుల నుంచి రుణాలను త్వరలోనే పొందే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు కీలక ప్రతిపాదన చేసింది. విదేశాల్లో ఉండే వారు రూపీ అకౌంట్లు తీసుకునేందుకు వెసులు బాటు కల్పించాలని యోచిస్తోంది.
2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్‌బీఐ స్ట్రాటెజిక్ ప్లాన్‌కు తుది రూపు తెచ్చింది. విదేశాల్లో వాణిజ్య రుణాలు ఇచ్చే ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ)ని కాస్త సరళీకరించాలని నిర్ణయించింది. స్థూల ఆర్థిక వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్న వేళ విదేశీ మారక నిర్వహణ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బీఐ తన వార్షికి నివేదికలో పేర్కొంది.






