4 July, 2026 | 8:41 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

బెంగళూరు తొక్కిసలాట: ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్

06-06-2025 11:39 AM
  1. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసు.
  2. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలే అరెస్ట్.
  3. ముంబై వెళ్లేందుకు యత్నం. 
  4. బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకోగా అరెస్ట్‌ చేసిన పోలీసులు.

కర్ణాటక: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగిన రెండు రోజుల తర్వాత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kempegowda International Airportఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్ఏ సునీల్ మాథ్యూలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు ఆర్‌సీబీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డిఎన్‌ఎ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association) పరిపాలనపై కేసు నమోదు చేయడంతో పాటు, ప్రతినిధులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) పోలీసులను ఆదేశించిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. కెఎస్‌సిఎ అధికారులు గురువారం రాత్రి నుండి పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌గా(Bangalore City Police Commissioner) సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది క్షణాల్లోనే ఈ అరెస్టులు జరగడం గమనార్హం. తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన బి. దయానంద స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. దయానందతో పాటు, తొక్కిసలాటకు దారితీసిన తప్పిదాలకు అదనపు కమిషనర్ వికాశ్ కుమార్ వికాశ్, డీసీపీ (సెంట్రల్) శేఖర్ హెచ్‌టి, ఏసీపీ సి. బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గిరీష్ ఎకెలను కూడా కర్నాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది.