చీనాబ్ వంతెనను పరిశీలించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీనాబ్ వంతెనను పరిశీలించారు. త్వరలోనే వంతెనను ఆయన ప్రారంభిస్తారు. కట్రా-శ్రీనగర్, కశ్మీర్-కట్రా వందేభారత్ రైళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పచ్చజెండా ఊపారు. ప్రధాని మోదీ శుక్రవారం నాడు జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత ప్రధాని తొలిసారి జమ్మూకశ్మీర్ కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే ఎతైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈఫిల్ టవర్(Eiffel Tower) కంటే చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం(Chenab Railway Bridge) 35 మీటర్ల ఎత్తులో ఉంది. 359 మీటర్ల ఎత్తు, 1,315 మీటర్ల పొడువుతో చినాబ్ వంతెన నిర్మించారు. ఇది భూకంపం, గాలి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది. జమ్మూ-శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ వంతెన కీలక ప్రభావం చూపుతుంది.
ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వేలింక్ ప్రాజెక్టులో భాగంగా వంతెన నిర్మించారు. తీగలతో నిర్మించిన అంజి రైల్వేవంతెనను ప్రధాని ప్రారంభించారు. రూ. 46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. యుఎస్‌బిఆర్‌ఎల్ (ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్) ప్రాజెక్ట్‌పై ప్రదర్శనను వీక్షిస్తూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన వ్యక్తులతో కూడా సంభాషించారు.






