27 August, 2026 | 7:36 PM

రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు

04-07-2026 07:54 PM

బేల,(విజయక్రాంతి): తెలంగాణలో ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై బేల మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ శివాజీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాంఖడే రుప్ రావ్ మాట్లాడుతూ... ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ, వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12వేల రూపాయలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు భరోసా సహాయం అందడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు.