06-12-2025 08:31:33 PM
నిజాంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎఫ్ఎస్టి బృందాలు తనిఖీలు చేపట్టారు. నిజాంపేట మండల కేంద్రంలో శనివారం డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి ఉండాలన్నారు. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు రవాణా చేయవద్దని సూచించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.