నమూనా జనగణనను పరిశీలించిన ఆర్డీవో జయచంద్ర రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న జనగణన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. శిక్షణలో భాగంగా చివరి రోజైన నేడు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు వడియారం గ్రామంలో క్షేత్రస్థాయిలో నమూనా జనగణనను నిర్వహించగా, తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సెన్సస్ 2027’ మొదటి దశలో భాగంగా చేపట్టిన ఈ నమూనా జనగణన ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్యుమరేటర్లు ఎలాంటి తప్పులు దొర్లకుండా సమాచారాన్ని సేకరించి, ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఏఎస్ఓ భూమేష్, ఫీల్డ్ ట్రైనర్స్ చల్లా లక్ష్మణ్, జంగం మల్లేష్‌తో పాటు ఎన్యుమరేటర్లు రాజశేఖర్, ప్రభాకర్, గోవింద్, ఎం.ఏ. నయీం తదితరులు పాల్గొన్నారు.






