కూకట్‌పల్లి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన బండి రమేష్
స్థాయికి మించి సీఎంపై విమర్శలు సరికాదు
కూకట్‌పల్లి, ఆగస్టు 29 (విజయక్రాంతి): కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని టిపిసిసి ఉపాధ్యక్షు డు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సవాల్ విసిరారు. గత పది స ంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణారావు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేక పోగా స్థాయిని మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు.
ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించబో మని ఆయన హెచ్చరించారు. శనివారం ఆ ంజనేయ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర ్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను విమర్శిస్తూనే బిఆర్‌ఎస్ పాలనపై నిప్పులు జరి గారు. పి జె ఆర్ హయాం నుండి నేటి వరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బ హిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
కృష్ణారావు హయాంలో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాకు గురయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. హస్మత్ పేట గ్రామ సర్వేనెంబర్ 1లో 100 ఎకరాలకు గాను 10 ఎకరాలు మిగిల్చారని, అల్లాపూర్ లో 4 ఎకరాలకు 2 ఎకరాలు మిగిల్చారని, గోపాల్ రావు నగర్ లో 10 ఎకరాల ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి కృష్ణారావు అతని అనుచరులు సొమ్ము చేసుకున్నారని రమేష్ విమర్శించారు. మొదటిసారి కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత, ప్రస్తుతం నీఆస్తి విలువఎంత అని కృష్ణారావును సూటిగా ఆయన ప్రశ్నించారు.
22ఏ విషయంలో ఎమ్మెల్యే ఉరి, హత్య ఆత్మహత్య అంటూ ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారంటూబండి రమేష్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే సమయంలో స్థాయిని గుర్తుంచుకొని నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. బిఆర్‌ఎస్ హయాంలో వేల ఎకరాలు అమ్ముకున్నారని, ఇది నీకు కనిపించడం లేదా అని కృష్ణా రావును ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ల అద్యక్షులు, డివిజన్ ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






