calender_icon.png 29 May, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌తో చర్చలకు సిద్ధం

28-05-2025 01:41:22 AM

  1. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదన

ఇరాన్ అధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రకటన

కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలు జరపాలని డిమాండ్

న్యూఢిల్లీ, మే 27: భారత్‌తో నెలకొన్న అన్ని వివాదాలపై చర్చలకు సిద్ధమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్న షరీఫ్, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మంగళవారం ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ.. కశ్మీర్, జలవివాదాలతోపాటు అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం.

వాణిజ్యం, ఉగ్రవాద నిరోధంపై కూడా భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్‌తో చర్చలు కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) స్వాధీనంపై మాత్రమే ఉంటాయని భారత ప్రధాని నరేంద్రమోదీ గతంలోనే స్పష్టం చేశారు.