calender_icon.png 29 May, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు

28-05-2025 01:43:48 AM

  1. విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక
  2. వీసా నిబంధనలకు కట్టుబడి ఉంటే మంచిది

న్యూయార్క్, మే 27: విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కన్నెర్ర జేస్తోన్న స ంగతి తెలిసిందే. తాజాగా విదేశీ విద్యార్థుల కు అమెరికా ప్రభుత్వం మరో హెచ్చరిక జా రీ చేసింది. తమ విద్యా సంస్థల్లో చదివే భా రత్ సహా విదేశీ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా వీసాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. క్లాసులు ఎగ్గొట్టినా,  డ్రాపౌట్ అ యినా, కళాశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్నా వీసా రద్దు చేసే అవకాశముందని తెలిపింది.

భవిష్యత్తులో అమెరికా వీసాకు దరఖాస్తు చే సుకునే అర్హత కూడా కోల్పోవాల్సి వస్తుంద ని పేర్కొంది. వీసా నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటూ ఇబ్బందుల పాలు కా కుండా జాగ్రత్త తీసుకోవాలని స్పష్టం చే సింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రా యబార కార్యాలయం దీనిపై మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘విద్యాసంస్థ ను ంచి డ్రాపౌట్ అయినా.. క్లాస్‌లు ఎగ్గొట్టినా.. విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దవుతుంది.

భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు’ అని అందులో పేర్కొంది. ఇటీవల అమెరికాలో విదేశీ విద్యార్థులను స్వల్ప కారణాలకే భారీ సంఖ్యలో స్వదేశానికి పంపించిన వైనం తెలిసిందే. ఈ ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా పడింది. పాలస్తీనా అనుకూల నిరసనలు సహా ట్రాఫిక్ ఉల్లంఘనల వరకూ ఏ చిన్న కారణం దొరికినా విదేశీ విద్యార్థులను స్వదేశానికి పంపించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నించారు.