calender_icon.png 29 May, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషం తాగి కుటుంబం ఆత్మహత్య

28-05-2025 01:39:32 AM

ఆగివున్న కారులో ఏడుగురి మృతదేహాలు

న్యూఢిల్లీ, మే 27: హర్యానాలో తాజాగా దారుణం జరిగింది. ఒకే కు టుంబానికి చెందిన ఏడుగురు ఆగివు న్న కారులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హర్యానాలోని పంచకుల ప్రాంతంలో ఈ ఘటన జ రిగింది. ఓ వ్యక్తి, అతడి భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు బ లవన్మరణానికి పాల్పడ్డారు. బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణశాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కా ర్యక్రమానికి హాజరయ్యేందుకు వ చ్చిన కుటుంబం..

అక్కడి నుంచి తి రిగి వెళ్లే సమయంలో ఈ తీవ్ర ని ర్ణయం తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఓ కారు తమ కారు వెనక పార్క్ చేసి ఉండటం గమనించిన స్థానికుడు దాని వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి అక్కడి కా లిబాటపై కూర్చున్నాడు. కారు ఇక్కడె ందుకు పార్క్ చేశావని ప్రశ్నించగా.. తన పేరు ప్రవీణ్ మిట్టల్ అని, బాగేశ్వర్ ధామ్ నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో రాత్రి బస చేసేందుకు హోటల్‌లో గది దొరకక ఇక్కడ ఆగినట్టు చెప్పాడు.

కారును అక్కడి నుం చి మరో చేటుకి మార్చుకోవాలని సూచించాడు. దీంతో అతడు వెళ్తుంటే కారులో పలువురు అచేతనంగా ఉండటాన్ని స్థానికులు గమనించారు. ప్రవీణ్‌ను పట్టుకొని నిలదీయగా తమ కుటుంబ సభ్యలంతా ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పాడు. మృతులను డెహ్రాడూన్‌కు చెందిన వారుగా గుర్తించారు. అ ప్పులు, తీవ్ర ఆర్థిక బాధలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.