25 March, 2026 | 2:48 AM

దళిత రైతుల భూములపై ‘రియల్’ దందా

25-03-2026 01:06 AM
  1. శంకర్ పల్లిలో 25 ఎకరాల కబ్జా!

తెల్ల కాగితాలపై సంతకాలు.. కులం పేరుతో దూషణలు.. బాధితుల ఆవేదన

రంగారెడ్డి, శంకర్పల్లి, మార్చి 24( విజయక్రాంతి ):అమాయకత్వమే వారికి శాపమైం ది.. నమ్మకమే వారిని నట్టేట ముంచింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై రియల్ ఎస్టేట్ గద్దలు కన్నేశాయి. కో ట్లాది రూపాయల విలువైన దళిత రైతుల భూములను కుట్రలు పన్ని ఆక్రమించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని కులం పేరుతో దూషిస్తూ బరితెగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామం లో వెలుగుచూసిన ఈ భారీ భూ కుంభకోణం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపు తోంది.

ప్రొద్దుటూరుగ్రామంలోని సర్వే నం బర్లు 240, 241, 249 పరిధిలో ఉన్న సు మారు 24 ఎకరాల 39 గుంటల భూమిని హస్తగతం చేసుకునేందుకు కొందరు వ్యక్తు లు మాస్టర్ ప్లాన్ వేశారు. సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్కు చెందిన యెర్రం విక్రాంత్ రెడ్డి (వై.వి. సుబ్బారెడ్డి కుమారుడు), బలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరికొందరు కలిసి ఈ ఆక్రమణకు పాల్పడ్డారని సుమారు 50 మంది ఎస్సీ (మాల, మాదిగ) సామాజిక వర్గానికి చెందిన రైతులు గొంతెత్తుతున్నారు.

 నమ్మించి మోసం.. తెల్ల కాగితాలే సాక్ష్యం

డబ్బు ఆశ చూపి, అమాయక రైతులతో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకోవడం ఈ మోసంలో ప్రధాన ఘట్టం. మొ దట ఎకరాకు రూ. 50 లక్షలు ఇస్తామని ఒ ప్పందాలు చేసుకున్న నిందితులు, తీరా భూ మిని తమ ఆధీనంలోకి తీసుకున్నాక పైసా కూడా చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు.చెల్లింపులు పూర్తి కాకుండానే భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అసలు యజమానులను పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటు న్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.

అట్టి భూమి విషయం పై బాధితులు అ భ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా నిఖిలా కన్స్ట్రక్షన్స్, విద్యాస్తలి ఇన్ఫ్రా వంటి సంస్థల పేరుతో అక్రమంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి.తమ భూమి తమకు కా వాలని కోరినందుకు 2023 సెప్టెంబర్లో బ లంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రైతులను ఉద్దేశించి అత్యంత హేయమైన రీతిలో కుల దూషణలు చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమను కులం పేరుతో దూషించడమే కాకుండాకేసులు పెట్టి లోపల వేయి స్తా‘ అంటూ బెదిరింపులకు పాల్పడటమే కా కుండా మహిళల పట్ల అవమానకరంగా ప్ర వర్తించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. న్యాయం కోసం అధికారులబాధితు లు ఐక్యమై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మే రకు బాధితులు చేవెళ్ల ఆర్డీఓ,ఏసీపీ తో పా టు శంకర్ పల్లి తహసీల్దార్ కు ఫిర్యాదులు చేశారు. దశాబ్దాలుగా మట్టిని నమ్ముకున్న మా భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో చిక్కుకున్నాయి. అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.