చండూరులో తెలంగాణ పబ్లిక్‌స్కూల్ ఏర్పాటు చేయాలి
చండూరు, మార్చి24: చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో చండూరు ఆర్డీవో కార్యాలయంలో డీఏవో పద్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనుండగా ఈ బడులు ప్రీ-ప్రైమరీ నుండి 12 తరగతులకు విస్తరిస్తాయి.
ఈ పాఠశాలల్లో బోధన, ఉచిత అల్పాహారం పూర్తి స్టూడెంట్ కిట్లు, అందిస్తూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం, సంతోషకరమని అన్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారు, అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ క్రీడా ప్రాంగణం కల్పిస్తారు. ఈ తరహా స్కూల్ కోసo చండూరు హైస్కూల్ అన్ని విధాల అర్హత కలిగి ఉన్నదని, నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మోడల్ స్కూల్స్, గురుకులం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్య అందిస్తున్నారు.
ఒక్క చండూరు మండల కేంద్రంలోనే నాణ్యమైన వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాల లేనందున తెలంగాణ పబ్లిక్ స్కూల్ చండూరు లో ఏర్పాటు కోసం చేయాలని వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్తపార్టీ సతీష్, చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ మండల కార్మిక విభాగం అధ్యక్షులు చొప్పరి దశరథ యాదవ్, కౌన్సిలర్ కొండ్రెడ్డి మధు, రాపోలు జగదీష్ , ఎండీ గౌస్, అబ్దుల్, నాగార్జున,భూతరాజు వెంకన్న, పాండు తదితరులు పాల్గొన్నారు.




