13 April, 2026 | 1:30 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

బాధింపబడిన వారికి భరోసా

07-02-2025 01:25 AM

 జిల్లా ఎస్పీ గైక్వాడ్  వైభవ రఘునాథ్ 

 నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి):  ఇతరుల చేతిలో అత్యాచారానికి గురై బాధింపబడిన వారికి అత్యంత రహస్యంగా మేలైన రక్షణ కల్పించే లక్ష్యమే భరోసా కేంద్రం ఉద్దేశమని నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా భరోసా కేంద్రం ద్వారా సుమారు 87 మంది మహిళలకు రక్షణ కల్పించడం జరిగిందన్నారు.  వారికి వైద్యం, న్యాయ సలహాలతో పాటు ఆర్ధిక భరోసా ఇతర రక్షణ కల్పించే బాధ్యత భరోసాపై ఉందన్నారు.

ఆపరేషన్ స్ముల్ ముస్కాన్ ద్వారా జిల్లా పోలీసు యంత్రాంగం 33మంది బాల కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు గుర్తు చేశారు. వారితోపాటు అదనపు ఎస్పీ రామేశ్వర్ తదితరులు ఉన్నారు.