8 April, 2026 | 3:08 AM

దళిత రత్న అవార్డు గ్రహీత

08-04-2026 01:21 AM

పిడమర్తి బాబురావుకు సన్మానం           

కోదాడ ఏప్రిల్ 7, కోదాడ పట్టణంలోని 29వ వార్డులో మాజీ కౌన్సిలర్ మేదర లలిత ఆధ్వర్యంలో దళితరత్న అవార్డు గ్రహీత, కోదాడ వాసి పిడమర్తి బాబురావును మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటువంటి అనేకమైన ఉన్నతమైన అవార్డులను పొందాలని దళిత జాతి యొక్క అభ్యున్నతి కొరకు దళిత యువకులకు ఒక మార్గదర్శకంగా కృషి చేయాలని మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆమె అభిలాషించారు ఈ కార్యక్రమంలో జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కళ్యాణ్ ,సోమపంగు శ్రీనివాసరావు ,మహేష్, చంద్రశేఖర్ ,తోటపల్లి నాగరాజు ,బాల సైదులు ,మల్లయ్య పాల్గొన్నారు.