30 July, 2026 | 5:46 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి

30-07-2026 05:09 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): దోస్త్-2026 స్పెషల్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కాలేజ్ కన్ఫర్మేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్–2026  స్పెషల్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీ లోగా తమ దోస్త్ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా, జూలై 31 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇతర అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో కళాశాలకు హాజరై సిసి ఒటిపి సమర్పించి కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. గడువులోగా కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేయని విద్యార్థులకు కేటాయించిన సీట్లు రద్దు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల స్పెషల్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులందరూ గడువు ముగిసేలోపు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ ప్రక్రియలను పూర్తి చేసి తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ కోరారు.