29 August, 2026 | 4:43 AM

తొలి భారత చెస్ ప్లేయర్‌గా రికార్డు

29-08-2026 01:28 AM

ఉత్కంఠ పోరులో అద్భుత విజయం 

సెంట్ లూయిస్, ఆగస్టు 28: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మ రోసారి చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అసలు ఊహించని విధంగా అతను ఈ విజయం సాధించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫై నల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఒక దశలో 3 వెనుకబడిన ప్రజ్ఞానంద ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అనూహ్య రీతిలో అద్భుతం గా పుంజుకుని మళ్ళీ ఆధిక్యంలో నిలిచాడు.

వరుసగా రెండు రాపిడ్ గేమ్‌లు గెలుచుకుని స్కోరును 11- తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ పోరులో కరువానా రెండో గేమ్‌ను గెలుచుకోవడంతో స్కోరు 12- వద్ద సమమైంది. అయినా సరే ఏమా త్రం ఒత్తిడికి గురికాకుండా ప్రజ్ఞానంద మూ డో బ్లిట్జ్ గేమ్‌ను చేజిక్కించుకుని మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరి గేమ్‌లో టైటి ల్ కైవసం చేసుకోవడానికి కేవలం డ్రా మాత్రమే అవసరమవగా, చాకచక్యంగా త్రీ-ఫోల్ రిపీటీషన్ పద్ధతి ద్వారా ఆ గేమ్‌ను డ్రా గా ముగించి విజేతగా నిలిచాడు.

దీంతో ఈ అరుదైన ట్రోఫీని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా నిలి చి రికార్డులకెక్కాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద సుమారు సుమారు రూ. 1.67 కోట్లు ప్రైజ్ మనీని గెలుచుకోవడంతో పాటు, 2027 గ్రాండ్ చెస్ టూర్కు నేరుగా అర్హత సాధించాడు. కాగా ఆరు పాయింట్ల భారీ వ్యత్యాసాన్ని దాటుకుని విజయం సాధించడం సులభం కాదని మ్యాచ్ అనంతరం అతడు తెలిపాడు. గడిచిన ఏడాది కాలంలో రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో తన ఆటతీరును ఎంతగానో మెరుగుపరుచుకున్నానని, అదే ఈ చారిత్రాత్మక విజయానికి  కారణమని చెప్పుకొచ్చాడు.