యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రికార్డు
- 8,378 కొనుగోలు కేంద్రాల ద్వారా 72 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
- 2023తో పోలిస్తే 13 లక్షల టన్నులు అధికం
- 12.33 లక్షల మంది రైతులకు రూ.15,121 కోట్ల చెల్లింపులు
- బీఆర్‌ఎస్ పాలనతో పోలిస్తే అదనంగా రూ.9,139 కోట్లు..
- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ర్టంలో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదుచేసుకుందని రాష్ర్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 8,378కొనుగోలు కేంద్రాల నుంచి ఈనెల 8వ తేదీ నాటికి 72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గత బీఆర్ ఎస్ పాలనలో 2023, జూన్ 8 నాటికి 59 టన్నులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది అదనంగా 13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు.
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవా రం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 12.33 లక్షల మంది రైతు లకు రూ. 15,121కోట్లు చెల్లించామన్నారు. 2023 యాసంగి సీజన్‌లో అప్పటి ప్రభుత్వం 9.81లక్షల మంది రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.5,982 కోట్లు చెల్లించిందన్నారు.
చెల్లింపుల్లో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యాసంగి సీజన్‌లో జూన్ 8 నాటికి కొనుగోలు చేసిన ధాన్యానికి తమ ప్రభుత్వం రూ.9,139కోట్లు అధికంగా చెల్లించినట్లు చెప్పారు. 2023 యాసంగి సీజన్‌తో పోల్చుకుంటే అదనంగా 1,344 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతాంగానికి రాష్ర్ట ప్రభుత్వం బాసటగా నిలబడిందన్నారు.
బీఆర్‌ఎస్ పాలకులు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి లో ధాన్యం దిగుబడి చేసుకోవడం వ్యవసాయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు.






