calender_icon.png 6 May, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డుల నిర్వహణను సక్రమంగా చేపట్టాలి

06-05-2025 12:00:00 AM

బోథ్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, మే 5 (విజయక్రాంతి): కేసులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సక్రమం గా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బోథ్ పోలీస్‌స్టేషన్‌ను సోమ వారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు.

అదేవిధంగా స్టేషన్ లోని రికార్డులు, పెండింగ్ వాహనాల, సిబ్బంది పనితీరుపై అరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టిగా గస్తీ నిర్వహిస్తూ ఆరికట్టాలన్నారు. రికార్డుల నిర్వహణ తప్పకుండా నవీకరిస్తూ ఉండాలని, రికార్డుల నిర్వహణ చేయాలనే సూచించారు. 

క్రమశిక్షణతో విధులను నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మమే కమై సత్సంబంధాలను మెరుగుపరుచుకుం టూ, ఎలాంటి రిమార్కులు లేకుండా, ప్రజలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొం దించే విధంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోథ్  సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.