calender_icon.png 6 May, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ఎస్పి రాళ్లను అక్రమంగా కొల్లగొడుతున్న కాంట్రాక్టర్

05-05-2025 11:15:24 PM

పర్మిషన్ ఎదంటు నిలదీసిన గ్రామస్తులు... 

నాగారం: నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పి కాల్వ వెంట ఉన్న రాళ్లను విఆర్ఆర్ కాంట్రాక్టర్ అక్రమంగా కొల్లగొడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం గ్రామస్తులు పని జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని అడిగి టిప్పర్ను జెసిపిని ఆపివేసీ ఆందోళనకు దిగారు. రాళ్లను తరలించడానికి పర్మిషన్ ఉందా అంటూ కాంట్రాక్టర్ పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ లైన్లో కాంట్రాక్టర్ ను సంప్రదించి పర్మిషన్ గురించి అడిగి నిలదీయగా పొంతన లేని సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రిప్పర్ను అదుపులోకి తీసుకొని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. గతంలో కూడా కాంట్రాక్టర్ ఇదేవిధంగా వ్యవహరించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోతే ధర్నాలో రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.