calender_icon.png 6 May, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలస్యంగా వస్తే అధికారులపై చర్యలు

06-05-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్ మే 5(విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు మొక్కుబడిగా వస్తున్నారని సమయపాలన పాటించడం లేదని అటువం టి అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

11 గంటల వరకు జిల్లా అధికారులు రాకపోవడం కొందరు అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులను ఉద్యోగులను పంపడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో ప్రజావాణికి వస్తారని అటువంటి వారికి సత్వర న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంద న్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు.

అక్రమ డి1 పట్టాలను రద్దు చేయాలి

నిర్మల్ మే 5(విజయక్రాంతి): సోను మం డలంలోని సిద్దులకుంటలో అక్రమంగా ఉన్న డి1 పట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గ్రామ శివారు ప్రాంతాల్లో ఎస్సారెస్పీ భూములు కొందరు అక్రమంగా డీ వన్ పట్టాలను సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుం టున్న వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని తాసీల్దార్‌కు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.