పోగొట్టుకున్న సెల్‌ఫోన్ ల రికవరీ
09-12-2024 10:18 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని వివిద పోలీస్ స్టేషన్ లలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాదితుల పిర్యాదు మేరకు ఎనిమిది సెల్ ఫోన్ లను రికవరీ చేసినట్లు నిజామబాద్ డిసిపి అడ్మిన్ బస్వరెడ్డి తెలిపారు. రికవరీ అయిన సెల్ పోన్ లను పోగోట్టుకొన్న వారికి సోమావారం తన కార్యాలయంలో అప్పగించారు. ఈ కార్యక్రమంలో సిఈఐఆర్ ఆపరేటర్ సుష్మను డిసీపీ బస్వరెడ్డి అభినందించారు.






