2 May, 2026 | 2:50 AM

కమాన్‌పూర్‌లో దొంగతనం

09-12-2024 10:11 PM

11 తులాల బంగారం తస్కరణ...

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలో బిల్ల రాజయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. కమాన్‌పూర్ పోస్టాఫీసు వీధిలో గల రాజయ్య ఇంట్లో గుర్తు తెలియని దొంగలు పడి 11 తులాల బంగారం, 80 తులాల వెండితో పాటు రూ.28వేలు ఎత్తుకెళ్లారు. రాజయ్య హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమారుడి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంను గమనించిన దొంగలు ఆదివారం ఇంట్లో చొరబడి దొంగతనంకు పాల్పడ్డారు. కాగా, రాత్రి ఇంటికి వచ్చిన రాజయ్య ఇంట్లో బీరువా పగులగొట్టి ఉండటం, ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడేసి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా బీరువాలో ఉన్న బంగారం, నగదు, వెండి దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని పరిశీలించారు. సంఘటన స్థలంలో పింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించారు. జాగిలాలను రంగంలోకి దింపారు. గత పక్షం రోజుల కిందట అంజలి అనే మహిళ ఇంటిలో దొంగతనం జరిగింది. ఇటీవలనే మండలంలోని జూలపల్లి గ్రామంలో ఏకంగా గ్రామ దేవతల విగ్రహాల దొంగతనం జరిగింది. వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.