మల్బరీ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా ఉద్యాన, పట్టు కామారెడ్డి జిల్లా పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ, పట్టు పురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి నెల లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందోని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ స్కిల్ బోర్డు సాంకేతిక అధికారి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మలర్భీ సాగులో వంగడాల ప్రాముఖ్యతను తెలిపారు.
నాణ్యమైన మల్బరీ ఆకు తయారు చేసే విధానాన్ని వివరించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి పద్దతిని అవలంబిచాలని తెలిపారు. మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక సహాయకులతో గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీని వినియోగించుకోవాలని కోరారు. మల్బరీ సాగులో అధిక దిగుబడి సాధించిన రైతు హర్షాద్‌ను ఈ సందర్భంగా శాస్త్రవేత సన్మానించారు. సమావేశంలో జిల్లా సెరికల్చర్ అధికారి ఐలయ్య, రాజయ్య, సాంకేతిక సహాయకుడు నాగేందర్‌రావు, ఉమ్మడి జిల్లా రైతులు బుచ్చిరెడ్డి, హర్షద్, ఏఈఓ లిఖిల్‌రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.






