15 April, 2026 | 4:33 PM

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి

14-04-2026 12:31 AM

కొత్తగూడెం, ఏప్రిల్ 13, (విజయక్రాంతి ): క్యాన్సర్ వ్యాధికి మూల కారణమైన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి క్యాన్సర్ వ్యాధి నుంచి విముక్తులు కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. ఎల్ టి ,ఫార్మసీ ఆఫీసర్, నెలవారి సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మన జీవితంలో భాగమైపోయిందని  ముఖ్యంగా అనేకమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు. ఆహారపదార్ధాలు, త్రాగునీరు వంటి వాటికి ప్లాస్టిక్ వాడకాన్ని ఉపయోగించకూడదని,

మన నిత్య జీవితంలో  ప్లాస్టిక్ ని దూరం పెట్టాలని, బయట ఆహార పదార్థాలను తినకూడదని , నూనెలు రీసైక్లింగ్ చేసి వాడుతున్నందువలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు   ప్రతిరోజు 5 లీటర్ల నీరు త్రాగాలని అలాగే శారీరక శ్రమ ,ఎక్స్సజులు , నడక , యోగా చేయాలని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా ఏజెన్సీ జిల్లా అయినందువలన ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్నారు. 

జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానలు , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందీర్ లలో ఆకస్మికతని తనికి చేస్తానని, సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన, సమయపాలన పాటించకపోయినా, శాఖ పరమైన చర్యలు తప్పవని  హెచ్చరించారు. పాముకాటు , కుక్కకాటు మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు.

ఎండాకాలం వడ దెబ్బ తగలకుండా ,ప్రజలకు ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. సికిల్ సెల్ , తల సేమియా, హెచ్‌ఐవి, వ్యాధిల పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , డాక్టర్ సాయి కల్యాణ్ , డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, కొత్తగూడెం, డాక్టర్ రాందాస్ , పిఓ మలేరియా , సొమ్లా సిహెచ్‌ఓ , రాంప్రసాద్ హెచ్ ఈ ఓ, కుమార స్వామి ఏ ఎం ఓ ,ఎల్టీలు మరియు ఫార్మసీ ఆఫీసర్స్ పాల్గొన్నారు.