రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’
14-04-2026 12:31 AM
నాగల్ గిద్ద, ఏప్రిల్ 13: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ’అరైవ్ అలైవ్ - 2026’ పేరుతో 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాగలిగిద్ద మండలం ఎస్త్స్ర కాశీపురం రామకృష్ణ తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వల్లూరు గ్రామంలో సర్పంచ్ తో కలసి గ్రామ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించరు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని, ప్రాణ రక్షణే ఈ ఉద్యమ లక్ష్యమని మండల ఎస్త్స్ర కాశీపురం రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం పూసల్ పాడు చౌరస్తా నుంచి నాగలిగిద్ద గ్రామం వరకు రోడ్డుపై గుంతలు గుర్తించి సొంత డబ్బులతో గుంతలు మోరం వేసి గుంతలు పొడిచేశారు. పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.






