రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ములకలపల్లి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ములకలపల్లి ఎస్త్స్ర మధు ప్రసాద్ కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం ములకలపల్లి లో అర్రైవ్, అలైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. మద్యం,మాదకద్రవ్యాలు సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.విరామం లేకుండా డ్రైవింగ్ చేయవద్దని,రెండు గంటలకు ఓసారి విరామం తీసుకోవాలని సీటు బెల్టు, హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయవద్దని సూచించారు.
పరిమిత వేగంతోనే వాహనాలు నడపాలని వేగం పెరిగే కొద్దీ ప్రమాద తీవ్రత పెరిగి రోడ్డు ప్రమాదాలు చేసుకుంటున్నాయని తెలిపారు.రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచి కోర్స చంద్రలేఖ,ఉప సర్పంచ్ పువ్వాల లలితారావు,తాసిల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో రామారావు తదితరులు పాల్గొన్నారు.




