19 April, 2026 | 6:21 AM

తగ్గిన వాణిజ్య లోటు

19-06-2025 01:22 AM

ఆర్థిక వేత్తల అంచనాల కంటే దిగువకు లోటు

ముంబై, జూన్ 18: మే నెలలో భారత వాణిజ్య లోటు 21.88 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఆర్థిక వేత్తలు వాణిజ్య లోటును 25 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచ నా వేయగా.. అంతకంటే దిగువకు చేరుకుని 21.88 బిలియన్ డాలర్లుగా వాణిజ్య లోటు నమోదయింది.

ఏప్రిల్‌లో 26.42 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు మే నెలలో 21.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సేవారంగం ఎగుమతులు 32.39 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. దిగుమతలు 17.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం వాణిజ్య ఎగు మతుల విలువ 71.12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డిమాండ్ తగ్గిన దృష్ఠ్యా ఆయిల్, గోల్డ్, లెడ్ (సీసం) మొదలైన వస్తువుల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి.