12 March, 2026 | 12:47 PM

నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్

12-03-2026 12:54 AM

కోటి రూపాయలు విలువచేసే స్థలాన్ని విక్రయించే యత్నం

ఏడుగురిని అరెస్ట్ చేసి చేసిన వనస్థలిపురం పోలీసులు

ఎల్బీనగర్, మార్చి 11: జీవించి ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని కాజేయడానికి అతడు చనిపోయాడని, ఒక నకిలీ మహిళను అతడి కూతురిగా నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన ముఠా సభ్యులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. ఈ మేరకు వనస్థలిపురంలోని ఏసీపీ కార్యాలయంలో బుధ వారం సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.

మునగనూరు రెవెన్యూ పరిధిలో సుమారు 400 గజల స్థలాన్ని గరి మెళ్ల కామేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు. చాలా రోజుల తర్వాత స్థలానికి సంబంధించి ఈసీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. తన స్థలాన్ని మరోకరి పేరు మీద రిజిస్ట్రేషన్ కావడంతో వెంటనే వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్, పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన గరిమెళ్ల కామేశ్వరరావు 1987 లో అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు గ్రామంలో సర్వే నంబర్లు 60, 74, 75, 76లో 400 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ (ప్లాట్ నం. 232) కొనుగోలు చేశాడు. చాలా కాలంగా ఆయన ప్లాటును చూడడానికి రాలేదు.

దీంతో ఆ ప్లాటుపై కొందరు నకిలీ పత్రాలు సృష్టించే ముఠా వల్లాల ప్రేమ్‌కుమార్, కోట్ల నాగేంద్ర ప్రసాద్, యెల్మటి సుకుమార్‌రెడ్డి కన్ను పడింది. ఎలాగైనా ప్లాటు ను కాజేయాలని కామేశ్వరరావు చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్లను నకిలీగా సృష్టించారు. వనస్థలిపురంలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నంబర్ 645/1987 తో నకిలీ సేల్డీడ్ కూడా సిద్ధం చేశారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇందుర్తి కృష్ణారెడ్డి, ముప్పల్ల సుజాత, నలవల్లి బాలమణి, తలారి సులోచన ఈ ముగ్గురికి సహకరించారు. అయితే సబ్‌రిజిస్ట్రార్ కు అనుమా నం రావడంతో పాటు, ఇటీవల కామేశ్వరరావు తన ప్లాటును ఆన్‌లైన్‌లో చెక్ చేసుకో వడంతో ఈసీలో వేరే వారిపై రిజిస్ట్రర్డ్ అయి ఉన్నట్లు కనిపించింది.

మోసం జరిగినట్లు గ్రహించి వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి 5 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, డెల్ ల్యాప్టాప్, నకిలీ సేల్డీడ్ డాక్యుమెంట్ (నంబర్ 645/1987) స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ పర్యవేక్షణలో, అడిష నల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కాసిరెడ్డి మార్గదర్శకత్వంలో, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్, ఎస్త్స్ర నాగరాజు నిందితులను అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సూర్య పరారీ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.