కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్య తీరేనా?
సీఎం దృష్టికి తీసుకెళ్తా..మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, మార్చి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ శివారులోని మానేరు పరివాహక ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్న ఆందోళ నలో ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి ప్రజాపాలన సభ లో పాల్గొన్న సందర్భంలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మరోమారు డంపింగ్ యా ర్డులో పొగలు వ్యాపించడంతో బుధవారం ఉదయం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్,
కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్ర పుల్ దేశాయ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, కా ర్పొరటర్ వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆంపల్లి మోహన్ లతో కలిసి డం పింగ్ యార్డును సందర్శించారు. డంపింగ్ యార్డు వల్ల కరీంనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో చొప్పదండి సభలో సీఎం డంపింగ్ యార్డును తరలిస్తామని హా మీ ఇచ్చారు.
డంపింగ్ యార్డును శాశ్వతం గా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉం దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భం గా పేర్కొన్నారు. డంపింగ్ యార్డు ద్వారా చు ట్టు పక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ డంపింగ్ యార్డు ఇతర ప్రాంతాలకు తరలిస్తారా, బయోమైనింగ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తారా చూడాలి. సంవత్సరం క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కరీంనగర్ వచ్చినప్పుడు డంపింగ్ యార్డును తరలించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ డంపింగ్ యార్డు తరలిస్తే కరీంనగర్-వరంగల్ మధ్యలో ఏర్పా టు చేస్తామని సీఎం చొప్పదండి సభలో హా మీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు స్థల సేకరణ జరగలేదు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో వే స్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి సరైన చర్య లు తీసుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తారా చూడాలి. 40 సంవ త్సరాలు గా పేరుకుపోతున్న చెత్తను ఒక్కరోజులు తరలించడం సాధ్యమయ్యే పనికాదు. కనీసం సంవత్సరకాలమైనా పడుతుంది.
డంపింగ్ యార్డు తరలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే శాశ్వత పరిష్కారం లభించినట్లే. క రీంనగర్నగరం విస్తరించింది. 66 డివిజన్లలో 60 వేలకు పైగా ఇళ్లు ఉండగా 3 లక్షల జనా భా దాటింది. 185 మెట్రిక్ ట న్నుల చెత్త ఉ త్పత్తి జరుగుతుంది. ఇంటింటి నుండి సేకరించిన చెత్తను మానేరు నదీ తీరానగల ప్రాంతానికి చేరవేస్తున్నారు. అప్పట్లో స్మార్ట్ సిటీ కింద 16 కోట్లతో బయోమైనింగ్ ప్లాం ట్ ను కూడా ఏర్పాటు చేశారు.
చేపట్టిన ప నులు నిలిచిపోవడంతో మళ్లీ పూర్వస్థితికి చే రుకుంది. ముఖ్యంగా వేసవికాలంలో మంట లు రావడం, దట్టమైన పొగ వ్యాపిస్తుండడం తో చుట్టుపక్కల కాలనీవాసులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది. పడుతున్నారు. దీనికితోడు భరించలేక దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఈ అంశంపై పలుమార్లు ఆందోళన కూడా చేశా రు. డంపింగ్ యార్డును మరోచోటుకు తరలించకుంటే శాశ్వత పరిష్కారం లభించదని స్థానికులు కోరుతున్నారు. సీఎం హామీ నెరవేరితే శాశ్వత పరిష్కారం లభించినట్లే. దీనికి ఎంత సమయం.. పడుతుందో చూడాలి.




