17 April, 2026 | 3:26 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి

16-05-2025 01:33 AM

-అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు 

- సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ 

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయానని, దీంతో ప్రయివేట్ కళాశాలలు, యజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపో యాయని, అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని గురువారం సీఎంకు రాసిన లేఖలో కేంద్రమంత్రి వెల్లడించారు.

ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశా లలు మూతపడ్డాయని, ప్రభుత్వం ఫీజు రీయెంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాల మధ్య గొడవలు జరిగి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసులు పెట్టుకుంటున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలన్నీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని ఒకసారి, 12 వాయిదాల్లో చెల్లిస్తామని మరోసారి చెప్పిన మాటలను మర్చిపోయారా? అని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తును, యాజమాన్యాల మనుగడను దృష్టిలో పెట్టుకొ ని తక్షణమే బకాయిలు చెల్లించాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.