calender_icon.png 14 February, 2026 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసికోల్లాసం

14-02-2026 04:32:25 PM

- కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి): క్రీడలతో మానసికోల్లాసం కలుగడమే కాకుండా క్రీడాకారుల్లో నాయకత్వ లక్షణాలు అలవాడతాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (KUMAR DEEPAK) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో కొనసాగుతున్న సీఎం కప్ - 2025 పోటీలకు జిల్లా యువజన క్రీడా సేవల అధికారి (DYSO) గుర్రాల హనుమంత రెడ్డి (GURRALA HANMANTHA REDDY), జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి (NEERATI RAJESHWARI) లతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు.

క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారని, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్స్, రూలర్ స్కేటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, సైక్లింగ్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఒలంపిక్స్ లో రాష్ట్రం తరపున పాల్గొని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ క్రీడ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.