ఐసీఎస్‌ఈ 10, 12 ఫలితాల విడుదల
07-05-2024 01:18 AM
హైదరాబాద్, మే 6 (విజయ క్రాంతి): ఐసీఎస్‌ఈ (పదో తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు(సీఐఎస్‌సీఈ) సోమవారం ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ లో ఈ మేరకు ఫలితాలను అందు బాటులో తెచ్చింది. పదో తరగతి, 12వ తరగతిలో బాలికలే పైచేయి సాధించారు. పదో తరగతిలో బాలి కలు 99.65 శాతం, బాలురు 99.31 శాతం మంది ఉత్తీర్ణత సాధింగా.. 12వ తరగతిలో బాలికలు 98.92 శాతం, బాలురు 97.53 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఐసీఎస్‌ఈ పరీక్షలు మార్చి 28న, ఐఎస్‌సీ పరీక్షలు ఏప్రిల్ 13న ముగిసిన విషయం తెలిసిందే. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను సైతం బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలు జూలైలో జరగనున్నాయి.




