నేటి నుంచి ఎప్‌సెట్
నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): నేటి నుంచి టీఎస్ ఎప్‌సెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు, రేపు (7, 8న) అగ్రికల్చర్, ఫార్మసీ, 9, 10, 11 వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగాలకు పరీక్షలు జరగ నున్నాయి. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమలు కానుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.విద్యార్థులను 90 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈసారి దాదాపు 3.60 లక్షల మంది అభ్యర్థులు ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకు న్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 35 వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ ఫార్మసీకి 135 కేంద్రాలు, ఇంజనీరింగ్‌కి 166 కేం ద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.




