ప్రాణాలపై పట్టింపేది?
- మన్సుర్ పల్లిలో చిరుత సంచారం
- మేకలపై దాడి
- భయాందోళనలు చెందుతున్న ప్రజలు
- పంట పొలాల వైపు వెళ్లాలంటే జంకుతున్న రైతులు
- పట్టించుకోని ఫారెస్ట్ అధికార యంత్రాంగం
గండీడ్, ఏప్రిల్ 7: చిరుత పులి అంటేనే వణుకు పుట్టుతుంది. అలాంటిది గండేడ్ మండల పరిధిలోని ఆయా గ్రామాల లో సమీపంలో చిరుత సంచరిస్తుంది... రెండు మే కల పై కూడా దాడి చేసింది ఆ దాడి ఘటనను కూడా ఫారెస్ట్ అధికారులు పంచనామా చేసి చిరుతపంజా నే అని నిర్ధారణ చేసి ఆయా గ్రామస్తులకు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేయుచున్రు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు ఆ చిరుతలు ఆ ప్రాంతంలో ఇప్పటికి ఉన్నాయా? లేవా అనే నిర్ధారణ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేయాల్సింది పోయి చిరుతలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు ఫారెస్ట్ అధికారుల నుంచి రావడంతో రాత్రి సమయంలో పొలాల దగ్గరికి వెళ్ళవలసిన రైతులు కూడా పొలాలను చూడడమే మానేశారు.
అసలే వేసవికాలం ఆపై పంట పొలాల్లో నీరు పుష్కలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో చిరుత ఉంది అనే సమాచారం రైతు గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. దీంతో రాత్రి తో పాటు పగటి సమయంలో కూడా బిక్కు బిక్కు మంటూ ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ అడుగులు వేస్తుండ్రు. అందరిని ఆవేదనకు గురిచేస్తుంది. స్పందించాల్సిన ఫారెస్ట్ అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఆ యా గ్రామస్తులు ఆసనం వ్యక్తం చేస్తుండ్రు.
ఇప్పటికే మేకలపై చిరుతల దాడి..
గండేడ్ మండల పరిధిలోని ఈ ఫారెస్ట్ లో మనసు పల్లి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు చిరుతలు ఉన్నట్లు అధికారులు గత పదిహేను రోజుల క్రితం ముందు గుర్తించారు. రెండు మేకలపై కూడా చిరుతలు దాడి చేయగా ఒక మేక మృతి చెందింది. ఫారెస్ట్ అధికారులు ఎలాంటి బోన్లు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు రాత్రి సమయంలో పొలాల దగ్గరికి వెళ్ళకపోవడంతో చేనులు తడి ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ప్రజల ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.
స్పందించాల్సిన ఫారెస్ట్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయా గ్రామస్తులు చెబుతున్న మాట. ఇప్పటికైనా ప్రత్యేకంగా బూండ్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో చిరుతలు ఉన్నాయా లేదా నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతుండ్రు. మన్సూర్ పల్లి. కొండాపూర్. ఆసిరెడ్డిపల్లి. రెడ్డిపల్లి. బల్సూర్కొండ. షేక్ పల్లి. ఎల్లం బాయి తాండ. కొత్త తండా ప్రాంత వాసులు భయం భయంతో జీవనం కొనసాగిస్తుం డ్రు. ఎప్పుడు ఏ చెడు వార్త వినవలసివస్తుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలు వచ్చిన వెంటనే...
చిరుతలు ఉన్న విషయం వాస్తవమే.. ఈ విషయంపై ఉన్నతాధికారు లకు లేక రాయడం జరిగింది వారి ఆదేశాల మేరకు బోన్లు ఏర్పాటు చేస్తాం అప్పటివరకు రైతులు జాగ్రత్తగా ఉండాలి.
ఎండి అబ్దుల్ హై, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్ మండలం
చిరుతలను పట్టుకావాలి...
చిరుతలను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలించాలి. నిత్యం చుట్టుముట్టు ఉన్న గ్రామాల ప్రజలు భయపడవలసిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అని తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పొలాలను సైతం సరిగ్గా చూడడం లేదు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతలు ఉంటే ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఏదుల బుగ్గన, మేకల కాపరి, మనసుర్ పల్లి గ్రామం
ఫారెస్ట్ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు
గత 15 రోజుల నుంచి ఫారెస్ట్. అధికారులకు సమాచారం ఇచ్చినాం ఇప్పటివరకు. అప్పుడు. ఇప్పుడు అంటూబోన్ పెట్టడానికి మా పై అధికారులు. పర్మిషన్ ఇవ్వలేదంటూ దాటవేస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి భోన్లు అమర్చలేదు. గత నెల 24 తారీఖున. బొంద గట్టుకు సాయంకాలం నేను మేఘాల మేపుతుండగా రెండు పులులు నా 2 మేకలపై అటాక్ చేసి నా రెండు మేకలని చంపడం జరిగింది. మా రెండు మేకల విలువ రూ 35వేల పై చిలుకే ఉంటుంది. చనిపోయిన రెండు మేకలకు. పంచనామ రాసుకొని వెళ్లిపోయిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ రాఘవేందర్. సమక్షంలో.చనిపోయిన రెండు మేకలకు. వెటర్నరీ డాక్టర్. పోస్టుమార్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
కొండాపురం, గొల్ల మైబు మేకల కాపరి




