27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

08-04-2026 12:31 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 7(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలను మెడిసిటీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఆవరణలో ఘనంగా నిర్వహించారు.సమాజంలో ఆరోగ్యం కోసం అందరం సైన్స్ కు తోడుగా వైద్య రంగంలో మానవ జంతు పర్యావరణ ఆరోగ్య పరిరక్షణకు ‘వన్ హెల్త్‘ విధానాన్ని ప్రోత్సహించాలని వైద్య నిపుణులు సూచించారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 7 వ తేదీన విశ్వవ్యాప్తంగా ప్రపంచ దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తారని తెలిపారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో భాగంగా రంగోలి క్విజ్ డిజిటల్ పోస్టర్ ల తయారీలో పోటీలు నిర్వహించారు. కళాశాలకు చెందిన డాక్టర్ అంకుష్ పవర్ అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని మానవ జంతు పర్యావరణ ఆరోగ్య పరిరక్షణకు ‘వన్ హెల్త్‘విధానాన్ని ప్రోత్సహించడంపై చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు.

దీనితోపాటు ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్న డిజిటల్ మీడియా ద్వారా ఆరోగ్య సంబంధిత అంశాలను ఎలా విస్తృతంగా ప్రచారం చేయవచ్చునని అంశంపై డాక్టర్ హేమలత తెలియజేశారు.అనంతరం అభిప్రాయాలని క్రోడీకరిస్తూ నిమ్స్ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్ర మాట్లాడుతూ పర్యావరణాన్ని జత చేసుకోకుండా కేవలం మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించడం సాధ్యం కాదాన్ని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా చివరగా రంగోలిలో మొదటి బహుమతి సాధించిన సిరి చందన బృందం కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి డాక్టర్ లియోవాజ్.ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్పన డాక్టర్.లియోవాజ్.డాక్టర్ ఈనాక్షి.డాక్టర్ పవన్ కుమార్ శర్మ.డాక్టర్ అంకుష్ పవర్.డాక్టర్ హేమలత లతో పాటు మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.