8 August, 2026 | 4:52 PM

పిజి రెండవ సెమిస్టర్ పరీక్షల తేదీల విడుదల

08-08-2026 03:28 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పిజి రెండవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఎం ఏ, ఎం కాం, ఎం ఎస్సి, ఎం బి ఏ, ఎం సి ఎ, థియరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను పరీక్షల నియంత్రణ విభాగం విడుదల చేసింది. పరీక్షలు ఈనెల 12 న  ప్రారంభమై  27 తో ముగియనున్నాయి.

పరీక్షలు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయని మరిన్ని వివరాలకు విద్యార్థులు ఆయా కళాశాలలో గాని లేదా విశ్వవిద్యాలయ వెబ్సైట్ ని సందర్శించాలని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు.