11 April, 2026 | 2:04 AM

బడ్జెట్ విడుదలచేసి బకాయి వేతనాలు చెల్లించండి

11-04-2026 12:19 AM

మంత్రి సీతక్కకు డైలివేజ్ వర్కర్స్ యూనియన్ వినతి

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 10, (విజయక్రాంతి):  గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయాలని, రూ 33కోట్ల బడ్జెట్  విడుదలచేసి బకాయి వేతనాలు చెల్లించాలని, రూ 26వేల కనీసవేతనంతో టైం స్కేల్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు, జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రావిునాభివృర్ధి, స్త్రీశిసుసంక్షేమశామంత్రి,సీతక్కకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జెఎసిజిల్లా కన్వీనర్, CITUజిల్లాఅద్యక్షులు కె.బ్రహ్మాచారి. మాట్లాడుతూ డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయాలని కోరారు ఒక్కొక్క జిల్లాలో మూడు నుండి 12 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని ఈ బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, జిల్లాలలో వేతనాలకు బడ్జెట్ ఉన్నప్పటికీ ట్రెజరీ అధికారులు బిల్లులను తిరస్కరిస్తున్నారని దీనివల్ల కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే ట్రెజరీ అధికారులతో మాట్లాడి బిల్లులను ఆమోదింప చేయాలని మంత్రిగారిని సిఐటియు జేఏసీ కోరింది. 45 రోజుల సమ్మె సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తగ్గించి వేసిన జీతాల ఏరియర్స్ ను చెల్లించాలని వేసవి సెలవులకు సంక్రాంతి దసరా సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని అధికారులను కోరారు. ఈ సమస్యలపై స్పందించిన మంత్రిసీతక్క సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని హావిుఇచ్చారు.

33 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపామని మే మొదటి వారంలో బడ్జెట్ వస్తుందని బకాయి వేతనాలు మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టైం స్కేలు ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రిగారిని కలిసిన వారిలో డైలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సేవియా పాల్గొన్నారు.

 గరిజన సంక్షేమ శాఖ ఔట్సోర్సింగ్ వర్కర్లకు 15,600 వేతనం చెల్లించాలి 

గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 15,600 జీవో 60 ప్రకారం వేతనం చెల్లించాలని సిఐటియు గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రిసీతక్కగారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఎటునాగారం ఐటీడీఏ పరిధిలో 15600 ఇస్తుండగా భద్రాచలం ఐపిడిఏ పరిధిలో 10780 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఇది చాలా అన్యాయమని ఈ సమస్యను పరిష్కారం చేయాలని మంత్రి తీసుకొని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తీసుకెళ్లారు మంత్రి గారిని కలిసిన వారిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శి కే సత్య తదితరులు పాల్గొన్నారు.