18 April, 2026 | 10:10 AM

బీజేపీ నేతలకు హైకోర్టులో ఊరట

24-06-2025 01:55 AM
  1. పాత కేసులు కొట్టేయాలంటూ హైకోర్టులో కమలం నేతల పిటిషన్లు
  2. కేంద్రమంత్రి బండి సంజయ్, హరీశ్‌బాబులకు.. వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం

హైదరాబాద్, జూన్ 23: గతంలో తమపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీజేపీకి చెందిన పలువురు నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబులకు ఊరట కల్పించింది.

కింది కోర్టుల్లో వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎంపీ లక్ష్మణ్‌కు సంబంధించిన కేసుల విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. అనంతరం, ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జులై 17వ తేదీకి వాయిదా వేశారు.