20 March, 2026 | 8:43 AM

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట

20-03-2026 12:00 AM
  1. పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈసీఐకి హైకోర్టు ఆదేశాలు 
  2. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్త పార్టీకి కవిత దరఖాస్తు
  3. దరఖాస్తులో లోపాలున్నాయని రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయడంతో ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన కవిత
  4. డాడీ, మోదీ, చిన్న మోదీపై నా పోరాటం
  5. నా ఇష్యును అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న రేవంత్‌రెడ్డి
  6. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మార్చి19 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితికు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్తగా స్థాపించనున్న తెలంగాణ ప్రజా జాగృతి పార్టీపై వీలైనంత త్వరగా నిర్ణ యం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల (ఈసీఐ) సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కవిత కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో గు రువారం విచారణ జరిగింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది మళ్లీ ఈసీఐకి దరఖాస్తు పంపినట్టు కవిత తరఫు న్యాయవాది ఈ సం దర్భంగా కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వర గా నిర్ణయం తీసుకుంటామని ఈసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్‌లో జరిగిన   పరిణామాల అనంతరం సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ఈ ఏడాది జనవరిలోనే కవిత ప్రక టించారు. ఉగాది నాటికి కొత్త పార్టీ ప్రకటన చేస్తానని కూడా స్పష్టంచేశారు. అయితే ఈ మేరకు కసరత్తు జరిగినా రిజిస్ట్రేషన్‌లో జా ప్యం కారణంగా పార్టీ ప్రకటనలో ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపైనే ఉంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రి  య అంతా పూర్తయి అధికారికంగా పార్టీ ప్రకటన జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటుం ది. అయితే కవిత ఏర్పాటు చేయబోతున్న పార్టీ పేరులో తెలంగాణ పదం ఉండటంతో బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా ఆమె కసరత్తు ఉండబోతున్నదనే చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారింది.

అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్‌ఎస్‌కు పేగు బంధం తెగిపోయిందనే విమర్శలు వ స్తున్నాయి. మరి ఇప్పుడు కవిత తన పార్టీ పేరులో తెలంగాణ పదం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాష్ట్ర రాజకీ యాల్లో కవిత పార్టీ ఆసక్తిని రేపుతోంది.

మంచి ముహూర్తం చూసుకుని ప్రకటిస్తా: కవిత

కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షు రాలు కల్వకుంట్ల స్పందించారు. డాడీ, మోదీ, చిన్నమోదీపైనే తన పోరాటమని సంచలన వ్యాఖ్యలుచేశారు. ఉగాది వేడుకల సందర్భంగా గురువారం బంజారాహిల్స్‌లో ని జాగృతి కార్యాలయంలో కవి త మాట్లాడుతూ.. తన కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు.

గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చే స్తున్నానని తెలిపారు. మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రకటిస్తానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో ఉన్న తన ఇష్యూను కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ప్రారంభించగానే అజెండా, లక్ష్యాలను ప్రకటిస్తానని తెలిపారు. అయితే, కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ గుర్తుగా ధర్మ గంట’ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రాను న్న శ్రీరామనవమికి పార్టీ పేరుతోపాటు గుర్తును కవిత ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.