30 April, 2026 | 2:06 AM

ఎండల నుంచి ట్రాఫిక్ సిబ్బందికి ఊరట

30-04-2026 12:54 AM

కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు, మిల్టన్ ఫ్లాసక్స్, కూలింగ్ గాగుల్స్ పంపిణీ

మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ డాక్టర్ శబరిష్ వేసవిలో ఊరట కల్పించారు. ఎండా కాలంలో ట్రాఫిక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ సిబ్బందికి శ్రేయస్సు దృష్ట్యా  ట్రాఫిక్ పోస్ట్లో వాటర్ మిస్ట్ స్ప్రింక్లర్స్ ఆధారిత కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సిస్టమ్ ద్వారా నీటి మిస్ట్ రూపంలో చల్లదనం కలిగించడంతో, మండుతున్న ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

అలాగే ట్రాఫిక్ సిబ్బందికి మిల్టన్ వాటర్ ఫ్లాసక్స్, కూలింగ్ గాగుల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం తీవ్ర ఎండల్లోనూ అంకితభావంతో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం కాపాడటం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ ఐ అరుణ్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది రాంచంద్రు, భాస్కర్, పాపాలల్, వెంకన్న, రామకృష్ణ, మోహన్ పాల్గొన్నారు.