30 April, 2026 | 2:05 AM

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి

30-04-2026 12:55 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 29 (విజయక్రాంతి): అకాల వర్షాలతో నష్టపోయిన రై తులను ఆదుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డ్ను సందర్శించిన వారు తేమ శాతం సంబంధం లేకుండా తడిసిన మొక్కజొన్నను రూ.2400 మద్దతు ధరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ పంటల సమయంలో యూరియా, కరెంటు సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొనుగోలు సమయంలో కూడా నిర్లక్ష్యం చూపడం రైతు వ్యతిరేక చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జ్ సి. కళ్యాణ్, జోన్ ఇంచార్జ్ పృథ్వీరాజ్, జిల్లా కార్యదర్శి మడుపు నాగేష్, మండలాల అధ్యక్షులు పానుగంటి రాంచందర్, బాలనాగులు తదితరులు పాల్గొన్నారు.