23 April, 2026 | 8:01 PM

రేప్ కేసులో జైలుకు.. గుండెపోటుతో ఖైదీ మృతి

19-12-2024 11:00 AM

జగిత్యాల: జగిత్యాల జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీ క్యాతం మల్లేశం (43) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. మల్లేశంకు ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే జైలు అధికారులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన మల్లేశం 15 రోజుల క్రితం రేప్ కేసులో మల్లేశం జైలుకు వెళ్లాడు.