23 April, 2026 | 6:08 PM

మోండా మార్కెట్‌లో అగ్నిప్రమాదం

19-12-2024 09:50 AM

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని కొన్ని దుకాణాల్లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఆస్తి దగ్ధమైనప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ సామగ్రి విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ప్లాస్టిక్ మెటీరియల్ షాపుతోపాటు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో మొత్తం నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. దుకాణాల్లో మండే పదార్థాలు నిల్వ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.