1 August, 2026 | 7:15 AM

ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్

29-10-2024 02:28 AM

వైద్య పరీక్షలకని తీసుకెళ్లగా..

ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్

వెంబడించి పట్టుకున్న పోలీసులు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అతడు అక్కడనుంచి పరారవ్వగా.. అతికష్టం మీ ద నిందితుడిని పోలీసులు పట్టుకు న్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పో క్సో కేసులో నిందితుడిగా ఉన్న మ హ్మద్ ఖాజాఖాన్‌ను ఈనెల 17న జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ క్రమంలో అతడిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఈనెల 22న భువనగిరి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆ సుపత్రిలో పోలీసుల కళ్లుకప్పి ఖాజాఖాన్ పరారయ్యాడు. అయితే ఆ త ర్వాత పోలీసులు చాకచక్యంగా ఖైదీని వెంబడించి పట్టుకుని తిరిగి భువనగిరి సబ్‌జైల్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది.