వృద్ధురాలికి పునర్జన్మ!
ప్రమాదకర కనితి తొలగింపు
అచ్చంపేట జూన్ 12 (విజయక్రాంతి): వృద్ధురాలి కడుపులో అత్యంత ప్రమాదకరమైన కనితిని తొలగించి అచ్చంపేట ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శాస్త్ర చికిత్స ద్వారా వృద్దురాలికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ ఘటన అచ్చంపేట పట్టణంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన రహ్మత్ బీ(68) తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆయా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులను ఆశ్రయించింది.
ఫలితం లేకపోవడంతో అచ్చంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు గర్భాశయంలోని పది సెంటీమీటర్ల పొడవు వెడల్పు గల ప్రమాదకర కనితిఉన్నట్లు గుర్తించారు. థైరాయిడ్, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలతో పాటు ఆస్పిరిన్ అనే గుండె సంబంధిత మాత్రల వినియోగంతో అధిక ప్రమాదం ఉన్న కేసుగా భావించినా గైనకాలజిస్ట్ అమ్రీన్ వారి వైద్య బృందం సవాల్ గా తీసుకొని హిస్టరెక్టమీతో పాటు బైలాటరల్ సల్పింగో-ఓఫోరెక్టమీ శస్త్రచికిత్స చేపట్టి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.






