13 June, 2026 | 1:08 AM

ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీఓ

13-06-2026 12:29 AM
  1. రూ.45 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
  2. నర్సింహులపేట మండల పరిషత్ ఆఫీస్‌లో ఘటన

మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): భూ మి వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, 45 వేల రూపాయలు తీసుకుంటుండగా ఎంపీడీవో, ఎంపీఓతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడుని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాం డెడ్గా  పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిం ది. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాం బయ్య తెలిపిన వివరాల మేరకు నర్సింహులపేట మండల పరిధిలోని పడమటిగూ డెం గ్రామంలో ఓ వెంచర్ ఏర్పాటు కు సంబంధించిన అనుమతుల కోసం బాధితుడు నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు.

అయితే, ఆ వెంచర్ అనుమతి మంజూరు చేయడానికి ఎంపీడీవో రాధిక, మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) కిన్నెర యాకయ్యలు సదరు బాధితుడిని లం చం డిమాండ్ చేశారు. మొదట్లో ఇద్దరికీ కలిపి 55 వేల నగదు వారికి చెల్లించాడు. అయినప్పటికీ వారు అనుమతులు ఇవ్వకుండా దాట వేస్తూ మళ్లీ డబ్బులు డిమాండ్ చేశారు. ఎంపీడీవో 20వేలు, ఎంపీఓ 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంపై శుక్రవారం దాడి చేసి బాధితుడి నుంచి 45వేలు తీసుకుంటున్న ఎంపీడీవో రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్యలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  ఈ అవినీతి భాగోతంలో ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జున కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఎంపీడీవో కార్యాలయంలో జరిగే అన్ని రకాల సెటిల్మెంట్లు, ఆర్థిక వ్యవహారాలను ఆయనే వెనకుండి చక్కబె డుతుంటాడని  సమాచారం.

లంచం డబ్బుల వసూళ్లలో కూడా ఇతనే మధ్యవర్తిత్వం వహించడంతో ఏసీబీ అధికారులు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇం దులో మరో ట్విస్ట్ ఏమిటంటే ఎంపీడీవో కుమారుడు ఓ పత్రిక విలేకరిగా పనిచేస్తూ, ప్రభుత్వ అక్రిడేషన్ కార్డు కలిగి ఉండడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఏసీ బీ అధికారులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. శనివారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

ఏసీబీ అధికారులకు ఎంపీ డీవో, ఎంపీవో పట్టుబడ్డ సంఘటన నేపథ్యంలో నరసింహుల పేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొందరు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.