calender_icon.png 12 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరుకుపోయిన చెత్త కుప్పల తొలగింపు

12-11-2025 11:02:21 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): గత వారం రోజులుగా అరుంధతి నగర్ బస్తీ లో చెత్తకుప్ప పేరుకుపోవడంతో బస్తీలో దుర్వాసన ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం జిహెచ్‌ఎంసి పారిశుద్య సిబ్బంది చెత్తను తొలగించారు. బస్తీలో జరుగుతున్న నూతన సివరేజి పైప్ లైన్ ఏర్పాటు రోడ్డు తవ్వకాలతో చెత్త తొలగించే వాహనాలు బస్థిలోకి వెళ్ళలేని కారణంగా చెత్త చొలగించలేదని, నేటి నుండి ప్రతి రోజు సిబ్బంది చెత్త తొలగిస్తారని, కార్పొరేటర్ సూచనల మేరకు పనులను పర్యవేక్షించిన బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ బస్తీ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం. ఉమేష్, బస్తీ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ యాదవ్, స్వామి దాస్, శ్రీనివాస్ గౌడ్, చందర్ తదితరులు పాల్గొన్నారు.